క్రికెట్ పిచ్చి: సరికొండ శ్రీనివాసరాజు
 సోముకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ పిచ్చి. చదవుకోవాల్సిన విలువైన సమయం మొత్తం క్రికెట్ ఆటకే కేటాయించేవాడు. సోము చెల్లెలు స్రవంతి వాళ్ల తరగతిలో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. చెల్లెలిని చూసి అయినా బుద్ధి తెచ్చుకోరా అని ఉపాధ్యాయులు ఎప్పుడూ తిట్టేవారు. ఉపాధ్యాయులు తిట్టిన ప్రతీసారీ సోము క్రికెటును వదిలి పెట్టి, ఇంటివద్ద చదువుకోవాలని ప్రయత్నం చేసేవాడు.  కానీ పనికి రాని మిత్ర బృందం సోమును నయానా భయానా మళ్ళీ క్రికెటులోకి లాగేవారు. సోము మళ్ళీ క్రికెట్ వ్యసనంలోకి దిగేవాడు. ప్రతీసారీ ఇది పునరావృతం అవుతుంది. 
     ఒకరోజు యథావిధిగా సోము స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాడు. రంగ అనే వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు.  రంగ ఆవేశంగా కొట్టిన భారీ షాట్ సమీపంలో ఉన్న శివ అనే బాలునికి తగిలి, శివ స్పృహ కోల్పోయినాడు.  పెద్ద దెబ్బ తగిలింది. అందరూ శివ చుట్టూ చేరినారు. క్షణాల మీద ఈ వార్త శివ తల్లిదండ్రులకు చేరింది.  వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. గొడవ మొదలైంది. శివకు తగిలిన దెబ్బకు కారణం ఎవరు? అని అడిగారు. అందరూ సోము నిర్లక్ష్యంగా కొట్టిన షాట్ వల్ల శివకు దెబ్బ తగిలింది అన్నారు.  సోము విస్తుపోయాడు. తాను కారణం కాదన్నా వినిపించుకునే నాథుడే లేడు. సోము షాక్.

కామెంట్‌లు