ఆట వెలదులు
నాన్నయనెడి పలుకు నయముగా నినుబెంచి
దైవదూతవలెను కావగలదు !
అమ్మమనసులోని యమృతబీజములవి
మొలకలెత్తు నాన్న కలలుగాను!!
బిడ్డ వేలుపట్టి ప్రియముగా నడిపించి
మెట్టుమెట్టునందు మేటిగాను
జీవితమున గెలుపు భావిలో నందించి
వెనుక నుండిపోవు వేల్పు నాన్న!!
మాటసున్నితంబు మానవత రూపము
కష్టపడుట నాన్న కిష్టమెపుడు!
శ్రామికజన రీతి శ్రద్ధగా పనిచేసి
పూలబాట వేయు బాలలకును!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి