వాయువు విషమై, మన శ్వాసలు బంధించెను..అగ్ని కోపమై, అడవులను బూడిద చేసెనుభూమి గాయమై, సారం కోల్పోయెను.ఆకాశం మేఘాలతో కాక, కాలుష్యంతో నిండెను.జలం కలుషితమై, జీవుల గుండెలు బెదిరెను.వాహనాల పొగకు,గాలి గాయపడెను.ప్లాస్టిక్ కుప్పలు, భూమిని ముంచెత్తెను.కర్మాగారాల వ్యర్ధాలు, నది నీటిలో విషం చిమ్మెను.మానవాళి ఆశలు,ప్రకృతిని మరచెను.రక్షణ మార్గం మన చేతుల్లోనే ఉంది....మొక్కలు నాటి, వాయువును శుద్ధి చేయాలి.అగ్ని సంరక్షణకై, అడవులను కాపాడాలి.భూమిని పచ్చగా, సేంద్రియంగా మార్చాలి.ఆకాశాన్ని నీలిగా, కాలుష్య రహితం చేయాలి.జలాన్ని పరిశుభ్రం చేసి, జీవం పోషించాలి.ప్లాస్టిక్‌ను తగ్గించి, ప్రకృతిని ఆదరించాలి.సౌరశక్తి, గాలి శక్తితో, జీవనం సాగించాలి.పంచభూతాల సమతుల్యత మన బాధ్యతగా తీసుకోవాలి.పర్యావరణ గీతంతో, భవిష్యత్తును కాపాడాలి!________
పంచభూతాల ఆర్తనాదం;- సాधNa సాధన.తేరాల,-ఎం. ఏ (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.,-మాధాపురం, ఖమ్మం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి