‘భూతల స్వర్గంలో’:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
ప్రకృతిని పరవశింప చెయ్యాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి
పచ్చదనాన్ని పరుపులా పరవాలి
స్వచ్ఛమైన గాలులను పీల్చాలి!

కానీ… సరుకులు కావు ఇవేవీ…
అంగట్లో కొనుక్కోవటానికి!
కొన్నిటినే కాదు… అన్నిటినీ అవలీలగా పొందగలగటం
మనసు పెట్టి మసలుకుంటే మన చేతిలోనే ఉంది!

రంగు… రూపును మార్చుకునే
వన్నెచిన్నెల సీతాకోకచిలుకల్లా
విహరిద్దాం స్వేచ్ఛగా…
నడవడికతో మార్చుకున్న భూతల స్వర్గంలో…!


కామెంట్‌లు