గురువందనం:- కె.వైష్ణవి-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం-జనగామ జిల్లా

 గురువులు మన జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు
వంటి వారు.మనకు జ్ఞానాన్ని,వివేకాన్ని అందించి మంచి మార్గంలో నడిపిస్తారు.ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో ముఖ్యమైనది. గురువంటే పుస్తకంలోని పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు.మన జీవితాలకు చక్కని దారిని చూపే మార్గదర్శకులు.మన భవిష్యత్తుకు రూపకర్తలు. చిన్నప్పటినుండి మనల్ని ఎత్తుకొని నడిపించింది తల్లిదండ్రులైతే, తెలివి వచ్చింది మొదలు అక్షరాలు దిద్దించి జ్ఞానాన్ని పెంచేది గురువులు.వారు తమ విలువైన సమయాన్ని,శక్తిని మనకోసం వెచ్చిస్తారు.తన జీవిత అనుభవాలను మనతో పంచుకుంటారు. మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తారు. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు.వారి ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. విద్యార్థి విజయంలో భాగస్వామి అవుతాడు.అందుకే ఉపాధ్యాయుడు సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తి.గురువుల గొప్పతనం గురించి చెప్పాలంటే వారు పదాలు చాలు.వారు సమాజానికి వెన్నెముక లాంటివారు.విద్యార్థులను జ్ఞానవంతులుగా,మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో కీలక పూత్ర పోషిస్తారు. గురువులు తమ జీవితాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితం చేస్తారు.గురువులు తమ జ్ఞానాన్ని,అనుభవాన్ని విద్యార్థులతో పరుచుకుంటారు.కేవలం పుస్తకాల్లోని విషయాలే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో,నైతిక విలువలను ఎలా పాటించాలో గురువులు నేర్పుతారు.తమ విద్యార్థులకు వారి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ అందిస్తారు.అందుకే గురువులను గౌరవించడం వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత.
కామెంట్‌లు