పర్యావరణం పరిరక్షణకు అందరం కృషి చేద్దాం :-బాలల మాసపత్రిక మొలక స్పెషల్ కరస్పాండెంట్ కేవీఎం వెంకట్!

 పరిగి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల (బాలుర) పాఠశాలలో విద్యార్థులకు బాల్యం అందమైన జీవితం అనే అంశంపై బాలల మాసపత్రిక స్పెషల్ కరస్పాండెంట్ కేవీఎం వెంకట్ అవగాహన కల్పించారు. పర్యావరణం పరిరక్షణ అనే అంశంపై బాలలకు మొలక దశ నుండే అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి స్వామి వివేకానందుని యొక్క జీవిత సందేశాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని నేటి యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
బలమే జీవనం బలహీనతే మరణం 
 కావున జీవితంలో కష్ట సుఖాలలో స్థితప్రజ్ఞ కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లాకు చెందిన కీర్తిశేషులు డాక్టర్ వనజీవి రామయ్య ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు. నో బొకే ఓన్లీ ఓన్లీ మొక్క లేదా బుక్కు ఇచ్చే సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల జన్మదిన సందర్భంగా మొక్కలను నాటించి వారికి ప్రజెంటేషన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం అని ప్రతి వ్యక్తి సంవత్సరానికి 5 చెట్టు నాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ శాలిని, ఏటీపీ ప్రభ, ఉపాధ్యాయులు రాజీవ్, శ్రీనివాస్, శంకర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు