ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఆధ్యాత్మిక మార్గం:- - యామిజాల జగదీశ్
 ఆల్ఫ్రెడ్ బ్రష్ ఫోర్డ్ (జననం 1950)ని అంబరీష దాస్ అని కూడా పిలుస్తారు. హెన్రీ ఫోర్డ్ సంపదకు అమెరికన్ వారసుడు. అతను ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు. ప్రముఖ వ్యాపారవేత్త హెన్రీ ఫోర్డ్ మునిమనవడు.
అతను 1974 నుండి ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద (శ్రీల ప్రభుపాద)  దీక్షిత శిష్యుడు. అతను మొదటిసారి అమెరికాలోని డల్లాస్‌లో భక్తివేదాంత స్వామిని కలిశాడు. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ 1975లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (హరే కృష్ణులు)లో చేరాడు. అదే సంవత్సరం అతను ప్రభుపాదతో కలిసి భారతదేశానికి తన మొదటి పర్యటన చేశాడు. హవాయిలో మొట్టమొదటి హిందూ దేవాలయ స్థాపనకు ఆయన సహాయం చేశాడు. 1983లో పూర్తయిన డెట్రాయిట్‌లో భక్తివేదాంత సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించడానికి 5,00,000 డాలర్లు విరాళంగా ఇచ్చాడు. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ సంవత్సరాల తరబడి ఇస్కాన్‌కు విరాళాలు ఇచ్చాడు. ఇవి ప్రభుపాద పుష్ప సమాధి మందిరాన్ని నిర్మించడానికి కొనసాగుతున్న ప్రాజెక్టులకు తోడ్పడ్డాయి. ఆయన శ్రీ మాయాపూర్ టెంపుల్ ఆఫ్ ది వేదిక్ ప్లానిటోరియం (TOVP అని కూడా పిలుస్తారు)కు చైర్మన్.
ఫోర్డ్ మాస్కోలో 10 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో వేద సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి తనవంతు సహకారమందించారుహోనోలులులో హరే కృష్ణ ఆలయం, అభ్యాస కేంద్రాన్ని నెలకొల్పడానికి ఆయన 600,000 డాలర్లతో భవనాన్ని కూడా కొనుగోలు చేశారు.

కామెంట్‌లు