"తెలుగు కథా సాహిత్యం- గ్రామీణ జీవితం" పై ఆర్.సి. కృష్ణస్వామి రాజు ప్రసంగం
   శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, తెలుగు అధ్యయన శాఖ వారు సోమవారం  నిర్వహించిన తెలుగు సాహితీ సమితి కార్యక్రమం ద్విగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ ఆర్ సి కృష్ణస్వామి రాజు గారి రచన వ్యాసంగాన్ని మొదలుపెట్టి 20 పుస్తకాలు వెలువరించారని తెలిపారు. తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనలలో పొందుపరిచారన్నారు. రాజుగారి రచనలు ఆహ్లాదకరంగా ఉంటాయని, విద్యార్థులు రచనలు చదివి మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రతి సృజన కారునిలో చిన్నపిల్లల మనసు ప్రస్ఫుటిస్తుందని, రాజుగారి రచనల్లో అది విశేషంగా స్పురిస్తుందని తెలిపారు. కథా వస్తువు చిన్నదైనా హృదయంలో చెరగని ముద్రగా వారి  రచనలు ఉన్నాయని కొనియాడారు.
            సాహితీ సమితి సలహాదారు డా. వై.సుభాషిణి మాట్లాడుతూ "తెలుగు కథా సాహిత్యం- గ్రామీణ జీవితం" మాట్లాడటానికి విచ్చేసిన కృష్ణస్వామిరాజుగారిని ప్రస్తావిస్తూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడానికి సాహితీ సమితి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ఎంతో అవసరమని, దానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు.
            వక్తగా విచ్చేసిన రచయిత

ఆర్.సి. కృష్ణస్వామి రాజు "తెలుగు కథా సాహిత్యం - గ్రామీణ జీవితం" అనే అంశంపై మాట్లాడుతూ తెలుగు విద్యను అభ్యసించడానికి ప్రస్తుత తరంవారు వెనకడుగు వేస్తున్నారని తెలుగు సాహిత్యం చదవాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలని తెలిపారు. రూపాయిలో ఉండే బొమ్మ, బొరుసులో బొమ్మ- సాహిత్యం, బొరుసు- సమాజమన్నారు.
             "గాండ్ల మిట్ట"అనే రచనపై ప్రసంగిస్తూ గ్రామీణ జీవనంలో ఆర్థిక ఇబ్బందులను అందులోని విలువలను తెలియపరిచారు. సమాజానికి సాహిత్యానికి గల అవినాభావ సంబంధం "ఫుల్ మీల్స్"రచనలో ఉందని పేర్కొన్నారు. "గురుదేవోభవ" అనే రచనలో గురువు గొప్పతనాన్ని, "కోడుగుడ్డు కథ" కథలోని తల్లి ప్రేమను తెలియజేశారు. "అమ్మ సినిమాకి వెళ్దాలంటోంది" అనే కథలో సమాజంలో ప్రస్తుతం ఉద్యోగం చేసే పిల్లలు తల్లిదండ్రులతో సమయం కేటాయించాలని కోరుకొనే విధానాన్ని వ్యక్తపరిచారు. "గోల్కొండను చూసి వద్దాం రారండి" అనే రచనలో సమాజాభివృద్ధి విస్తృతంగా సాగుతుందని తద్వారా మనుషుల్లో సాహిత్యం ఎవరిని ఎలా కదిలిస్తుందో తెలియదన్నారు. తెలుగు విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. సమాజంలో తెలుగు విద్యార్థులకున్న విభిన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని కాంక్షించారు.
            సాహితీ సమితి ఉపాధ్యక్షులు జి.వాణి స్వాగతం పలుకగా; అధ్యక్షులు ఎ.ప్రనూష వక్తను పరిచయం చేశారు. కార్యదర్శి బి.శిరీష వందన సమర్పణ చేయగా, కోశాధికారి ఎ.మోహిత నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డా. బి. లక్ష్మీప్రియ, పరిశోధక విద్యార్థినులు, మహిళా అధ్యయన విభాగం పరిశోధక విద్యార్థినులు, పుర ప్రముఖులు విద్యాసాగర్ గారు, తెలుగుశాఖ విద్యార్థినులు  పాల్గొన్నారు.
డా. వై. సుభాషిణి, సాహితీసమితి సలహాదారు, 9000102394
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం