పేదవాడు!!? - డా ప్రతాప్ కౌటిళ్యా.
ధనవంతుడు ఎలాగైనా 
ధనం సంపాదిస్తాడు !!
పేదవాడు పని సంపాదించాలి.!!

ధనవంతుడు ఎలాగూ 
ఖాళీగా ఉండడు. 
సంపాదనలో ఉంటాడు.!!

పేదవాడు 
మాత్రమే ఖాళీగా ఉంటాడు.!!?

పేదవాడు ఖాళీగా ఉంటే 
రోగి అవుతాడు 
క్రిమినల్ అవుతాడు
కిరాతకుడు అవుతాడు. 
త్రాగుబోతవుతాడు 
తిరుగుబోతువుతాడు 
తిండి పోతావుతాడు. 
ఉన్మాది అవుతాడు 
ప్రేమోన్మాదీ అవుతాడు.

ధనవంతుడు ధనం సంపాదిస్తాడు.!
పేదవాడు పని సంపాదించాలి.!!!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు