ఎందుకని...? ఏమో...ఆ పరమాత్మకే ఎరుక..!:- కవి రత్న-సాహిత్యధీర సహస్రకవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
అవలీలగా
సముద్రాలను ఈదగలరు 
నరులు...మహా ముదురులు
కానీ ఆ సముద్రాలను 
నీటితో నింపలేరు…
నీటిని తోడి ఖాళీ చేయలేరు…
ఒక్క నీటి బిందువును 
కూడా సృష్టించలేరు...
ఎందుకని...? ఏమో...
ఆ పరమాత్మకే ఎరుక..!

ఎంత ధనమున్ననేమి..?
ఎంత వైద్య విజ్ఞానమున్ననేమి..?
కొందరు కోరిన బిడ్డను 
కొనలేరు సృష్టించు కొనలేరు...
నవదంపతులు ఆగక 
తప్పదు నవమాసాలదాకా...

ఆపై చింతలు మరిచి 
చిరునవ్వులతో...
ఆనందంగా సంతోషంగా...
ఇష్టమున్నా లేకున్నా...
పుచ్చుకోక తప్పదు 
పుట్టిన బిడ్డ ఎవరైనా...అదే 
ఆ పరమాత్మ...వరమనుకొని
ఎందుకని...? ఏమో...
ఆ పరమాత్మకే ఎరుక..!

ఒలింపిక్ మైదానంలో జరిగే 
ప్రపంచ ప్రఖ్యాత ఆటల పోటీల
నియమాలన్నీ తెలిసిన రిఫరీలకు
చిట్టచివరి నిమిషం వరకు 
తెలియనిదొక్కటే... ఆ 
ఆటల పోటీలలో విజేతలెవరో...
ఎందుకని...? ఏమో...
ఆ పరమాత్మకే ఎరుక...!


కామెంట్‌లు