సత్యవతి వృత్తాంతం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో అతి ముఖ్యమైన మహిళ సత్యవతి ఆమె పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకుందాం ఉపరిచరుడు అనే రాజు తన వీర్యాన్ని ఒక మర్రి ఆకులో భద్రపరుస్తాడు దాన్ని తన భార్యకు అందజేయాలని ఒక డేగచేత  పంపుతాడు అతని భార్య గిరిక దాన్ని స్వీకరిస్తే మంచి సంతానం కలుగుతుంది కానీ ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది ఒక నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణుడు నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటుండగా అగ్నిక అనే అప్సరస అతని హేళన చేసింది ఆయన కోపించి నీవు చాపగా పుట్టు అని శపిస్తాడు ఈ అగ్నిక నీటిలో ఉండి ఆయన కాలుని లాగుతూ సతాయించింది అప్పుడు ఆమె శాపానికి భయపడి ఆ బ్రాహ్మణుని శరణు వేడుతుంది పరాశక్తి అనుగ్రహంతో నీవు చే పగా ఉన్నా నీకు పిల్లలు పుడతారు అప్పుడు నీవు అప్సరసగా మారి నీ లోకానికి వెళ్తావు ఇక్కడ యమునా నదిలో అగ్నిక  చేప చేపగా తిరుగుతుండగా డేగ తీసుకుని వెళుతున్న ఆ మరి ఆకుని ఇంకో ఇంకో డేగ అటకాయించి దాన్ని నీటిలో పడేస్తుంది అగ్నిక చేప ఆ కులోని వీర్యాన్ని మింగుతుంది ఒక జాలరి దాన్ని పట్టి ఇంటికి తీసుకెళ్ళి కోయగానే చేపల పొట్టలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కనిపిస్తారు ఆ పిల్లాడిని మత్స్యరాజు పెంచుకుంటాడు. ఆడపిల్లని ఒకదాసరాజు పెంచుతాడు. ఆపిల్ల చేపల చేపలవాసన కొట్టడంవల్ల మత్స్యగంధి అని పిల్వబడింది.ఆమె గర్భాన ఓమహాపురుషుడు పుట్టే యోగం ఉంది.పరాశర మహర్షి యమునానదిని దాటిస్తుంది ఈపిల్ల.మంచుతెరలు కల్పించి చీకటిని సృష్టించిన పరాశరునివల్ల సద్యోగర్భంలో వ్యాసభగవానుడుపుడతాడు. పుట్టిన వెంటనే పెద్ద వాడై తపస్సుకి వెళ్లిపోతాడు.పరిశ్రమను వల్ల ఆమె 3వరాలు పొందింది.కన్యాత్వం దోషం అంటదు.శాశ్వత యవ్వనంతో కస్తూరి వాసనతో యోజనందూరం ఆపరిమళం వ్యాపిస్తుంది. అలాయోజనగంధిగా పేరు గాంచి శంతనమహారాజుని పెళ్లాడుతుంది.భీష్ముడు ఈసవతితల్లికి ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. సత్యవతి వల్లనే కురువంశం ఆరంభమైనది.ఇక పాండవుల కౌరవుల కథ ఇలా మొదలైంది.ఆదిశంకరాచార్యులవారు చెప్పినట్లు మహాత్ముల తేజస్సు స్ఖలనం ఐతే మంచి క్షేత్రంలో పడాలి. దేవీభాగవతంలో కూడా ఇలాచెప్పబడింది" అమ్మవారి దయవల్ల నారాయణుడు మోహిని గా మారి రాక్షసులకు అమృతం ఇవ్వలేదు.శివుడు మోహినికి పుట్టినవాడు హరిహరుడు అయ్యప్ప.మహిషి అనే రాక్షసిని చంపాలి కాబట్టి కామప్రచోదనంకి సరైన విత్తు క్షేత్రం అవసరం.అదే కథల రూపంలో వివరణ ఇచ్చారు.వేదవ్యాసుని తల్లిగా సత్యవతి ధన్యురాలు🌷
కామెంట్‌లు