న్యాయాలు-915
నఖలు ప్రేమ చలం సుహృజ్జనే న్యాయము
****
న ఖలు అనగా నిశ్చయంగా కాదు, ఖచ్చితంగా కాదు. ప్రేమ అనగా ఆకర్షణ, ఆప్యాయత.అచలం అనగా చలనం లేనిది, కదలకుండా ఉండేది. సుహృజ్జనం అనగా సుహృత్ +జనం అనగా మంచి+ స్నేహితులు.
స్నేహితుని యందు ప్రేమ చలించదు.అనగా మంచి స్నేహితుల మధ్య స్నేహం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది.
దీనికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దాం. ఇది మహా కవి కాళిదాసు రాసిన "కుమార సంభవం" అనే గ్రంథం లోనిది.
అయి సంప్రతి దేహి దర్శనం/ స్మర!పర్యుత్సక ఏష మాధవః దయితాస్వనవస్థితం నృణాం/ న ఖలు ప్రేమ చలం సుహృజ్జనే"
అనగా ప్రియరాళ్ళ విషయంలో పురుషుల బుద్ధి చంచలమే గానీ స్నేహితుల విషయంలో ప్రేమ ఎప్పటికీ చలించదు.ఒకేవిధంగా ఉంటుంది. ఇదిగో నీ స్నేహితుడు వసంతుడు వచ్చాడు.అతడితో మాట్లాడు అని అర్థము.
ఈ లోకంలో స్నేహం అనే పదానికన్న గొప్ప పదం మరొకటి లేదు. స్నేహమనే దానికన్నా గొప్ప వరం మరొకటి లేదు.
మనుషులకు దేవుడు ఇచ్చిన వరం స్నేహం. మంచి స్నేహానికి ఎలాంటి షరతులు వర్తించవు. ఎందుకంటే ఎలాంటి భేషజాలు లేనిది స్నేహం.శరీరాలు వేర్వేరు అయినా మనసు ఒక్కటేగా మసలుకునేది.
స్నేహంలో కోపతాపాలు, అలకలు అసూయలు ఉండవు. ఒకవేళ ఉంటే అద్దం మీద ఆవగింజల్లాంటివి. అవి ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి.కష్టాల సమయంలో స్నేహితులు వచ్చినంత భరోసా ఇంకెవరు ఇవ్వరు. అపోహలు, అనుమానాలకు స్నేహంలో తావుండదు.
మంచి స్నేహితుల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. పేదా గొప్ప తేడాలు ఉండవు. చిన్న, పెద్ద వ్యత్యాసం ఉండదు.కులమతాలకు అతీతమైనది స్నేహము.అమ్మా నాన్నలకు కూడా చెప్పలేని సమస్యలను స్నేహితులతో చెప్పుకోగలం.
ఈ సందర్భంగా స్నేహానికి సంబంధించిన కొన్ని పాటలను చూద్దాం."స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా,"స్నేహమేరా జీవితానికి వెలుగు నిచ్చే వెన్నెల" దోస్త్ మేరా దోస్త్ లాంటి పాటలు స్నేహం యొక్క గొప్పతనాన్ని చెబుతాయి.
ఇక విషయానికి వద్దాం. ఈ స్నేహితుని యందు ప్రేమ చలించదు,చెక్కు చెదరదు అనడానికి కృష్ణ కుచేలుడి స్నేహమే గొప్ప ఉదాహరణ. చిన్నప్పటి స్నేహం మరచి పోకుండా కుచేలుని ఆదరణతో ఆహ్వానించి పేదరికాన్ని పోగొడతాడు. ఏళ్ళు గడిచినా వారి స్నేహం చెక్కుచెదరలేదు.
ఈ" న ఖలు ప్రేమ చలం సుహృజ్జనే న్యాయము ద్వారా చెక్కుచెదరని స్నేహం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం.
ఈ సందర్భంగా మరో మాట చెప్పుకోవాలి.సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కలా సువాసన వెదజల్లుతూ వుంటుంది.చెడ్డ వారితో స్నేహం మురికి కాలువలో నీరులా దుర్గంధంతో అందరికీ దూరం చేస్తుంది.కాబట్టి మంచివారితో స్నేహం చేయాలి.ఇదే ఈ న్యాయం ద్వారా మనం గ్రహించాల్సిన విషయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి