తీరా చూద్దును కదా!:- - యామిజాల జగదీశ్
 మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం వెలుపల ఓ పుస్తకాన్ని చూసీ చూడటంతోనే కొన్నాను. దాని పేరు : "ఆల్బమ్ అండ్ హిస్టరీ ఆఫ్ రామేశ్వరం". 
ముఖ్యంగా ఈ పుస్తకం కొనడానికి కారణలు రెండు. ఒకటి ఆరు భాషలలో కూర్చిన పుస్తకం. అవి, సంస్కృతం, హిందీ, తమిళం, ఇంగ్లీషు, తెలుగు, కన్నడం. 
రెండవ కారణం...ఫోటోలు.‌ రామేశ్వరం సహా ఇరుగు పొరుగు ప్రాంతాల్లోని దర్శనీయ స్థలాల ఫోటోలు.‌ అద్భుతంగా ఉన్నాయి.
అలాగే పద్నాలుగు పేజీలలో ఆరు భాషల్లో పొందుపరిచిన విషయమూ ఆసక్తికరమే. కానీ తెలుగులో అనువదించిన వారెవరో తెలీలేదు. టైప్ చేసిందెవరో, ప్రూఫ్ చూసిందెవరో కానీ వాక్యనిర్మాణం మొదలుకుని అన్నీ తప్పులతడకలే. ఎందుకంత అశ్రద్ధో అర్థం కాలేదు.‌ మంచి పుస్తకం అన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అక్షరదోషాలు కోకొల్లలు. ఏదో ఫలానా పేజీలో మాత్రమే తప్పులున్నాయంటే సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రతి వాక్యంలో నూ తప్పులో తప్పులు. అయ్యబాబోయ్....
అదేమంత నిర్లక్ష్యం?!
అయితే మిగిలిన పేజీలను కలర్ ఫోటోలతో కనువిందు చేశారు.‌ ఫోటోలు చాలా చాలా బాగున్నాయి. అవి చూడటంతోనే ఆయా ప్రదేశాలకు వెళ్ళి చూడాలన్నంత ఆసక్తి కలుగుతుంది. ఇందుకు హ్యాట్సాఫ్. 
రామేశ్వరం ఆలయ చరిత్ర ఒక పేజీలో ఇంగ్లీషులో క్లుప్తంగా ఇచ్చారు బాగుంది.

కామెంట్‌లు