అమ్మ గోడ మీద పటమైవ్రేలాడుతోంది: - అంకాల సోమయ్య -9640748497


(నిత్యం మమ్మల్ని దీవిస్తుంది)

అమ్మ ఆ పటంలో 
నిత్యం నన్నేచూస్తోంది 
నా బాధను ఆవేదనను
తాను చూస్తున్నట్టు
తాను వింటున్నట్టు 
నాకు అనిపిస్తుంది 
ఎందుకో మా అమ్మ నా చుట్టేతిరుగుతున్నట్టు
నా భుజం తడుతున్నట్టు
భ్రమకల్గుతుంది
కాదు
 ఇ(అ)దే నిజమైతే ఎంతబాగుడోకదా
అనిపిస్తుంది 

నేను ఊరెళ్ళిన్నాడు
ఇంటికి పెద్ద దిక్కు నేను ఉన్నాను
పో బిడ్డా అని అన్న 
మా అమ్మ మాటలే
నా మనసుకు విన్పిస్తున్నాయి

నాయన నా పసి వయసులోనే
కాలం చేస్తే 
 అన్నీ తానై 
మా ముగ్గురిని సవరించింది అమ్మే

అమ్మ శ్రమజీవి 
అమ్మ ఇంటా బయటా 
అన్నీ తానై 
అలుపెరుగని భూతల్లిలా 
మా చుట్టూ
పని పాటలచుట్టూ నిత్యం పరిభ్రమించేది

అమ్మ ముఖంలో ఏనాడూ నేను అసటచూడలే
నిత్యం ఎంతో ఉత్సాహంగా ఉండేది
అమ్మ కూర్పుప్రొద్ధుకాడనే లేచి 
ఇంటెడు పనులు చేసి 
మా వృత్తి పని 
బయటవ్యవసాయయపనులకు 
వెళ్ళేది
ఒక్క దసరా పండుగ నాడు తప్పా
ఏరోజు అమ్మ పనికి పోకుండా 
ఇంట్లో ఉన్న దాఖలాలు నేను చూడలేదు
పండగ పూట పిల్లలు ఫలహారాలకు
ఇరుగుపొరుగు ముఖాలు చూస్తారని 
పండగ ఐదు రోజులున్నదనంగనే
తీరొక్క పిండి వంటలు రాత్రంతా నిద్రకాసి చేసేది
తెల్లారి మళ్ళీపనిపాటకెళ్ళేది
అమ్మల త్యాగం 
బిడ్డలకు వరం 
బిడ్డలు ఎదిగి ప్రయోజకులయ్యే
సమయానికి కాలధర్మం చెందడం
కన్నబిడ్డలకు దుఃఖాతిశయమే

దయలేని దేవుడు అన్నీ తానై పెంచిన అమ్మను వెంట తీసుకెళ్లి తాను మహాపాపమే మూటకట్టుకున్నాడు

అమ్మ నీ రూపు నీ ఓర్పు 
నీ సాహసం 
మాలో నింపావు
అదే మాకు వేయి ఏనుగులు బలం 
ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ
నీ బిడ్డగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తానమ్మా
తానెక్కడున్న మా జ్ఞాపకాల్లో చిరంజీవి మా అమ్మ 
అమ్మ నీ చల్లని చూపు ఎల్లప్పుడూ మా పై ప్రసరిస్తావు గదూ

కామెంట్‌లు