ఒడిలో నిండిన కలలు
ఒడలంతా అయిన కనులు
ఒనరుగా నెరవేరే తరుణంకై
ఓపికగా చూసే మనసులు
రంగులు నిండిన నింగిపై
హంగులు చూసిన మదిలో
చెంగున వేసిన గెంతులతో
పొంగిన ఊహల ఉప్పెన
నమ్మక తప్పని రేపటికై
గుండెల నిండా ఆశలు
తీరే దారుల తెన్నులకై
వెదికే కన్నుల దీపాలు
తీయని తలుపుల వెనుక
తియ్యని ఊహల పంటలు
తీపిగ తెచ్చే కానుకకై
ఓపిక నిండిన ఎడదలు
రానున్న వెలుగులు మనకేనని
కానున్న వేకువ మనదేనని
ఏమున్నా లేకున్నా మనకేమని
ముందున్న రోజులు మనవేనని!
మనవిగ మనసును తెలిపి
మనకిక తోడువి నీవేనని
మనలను నడిపే తండ్రికి
మన్నించమని ప్రార్థిస్తూ...
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి