ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ : వెంకట్ , మొలక ప్రతినిధి

 పెద్దేముల్ మండలంలోని కందనెల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు  రచించిన మూడు పుస్తకాలను తాండూర్ శాసన సభ్యులు  బుయ్యని మనోహర్ రెడ్డి  ఆవిష్కరించారు.  తెలుగు సాహిత్యంలో వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూసల కవితా ప్రక్రియలో తాటికొండ అర్చన రాసిన "తాటికొండ మణిపూసలు", బింగి గాయత్రి రాసిన "గాయత్రి మణిపూసలు" 24మంది విద్యార్థులు రచించిన "కందనెల్లి కవితలు " అనే పుస్తకాలను శాసన సభ్యులు ఆవిష్కరించారు. స్థానిక పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు శెట్టి శివకుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను సాహిత్యం వైపు ఆలోచింప చేయడం, రచనలు చేసే విధంగా తయారు చేయడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల్లో సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కవితలు రాసిన 24 మంది బాలబాలికలు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పెద్దేముల్  మండలధికారులు వెంకటేష్ ప్రసాద్ ( MRO ), రతన్ సింగ్ (MDO) , నర్సింగ్ రావు MEO) , DCC అధ్యక్షుడు ధారాసింగ్ , గ్రామ సర్పంచ్ శ్రీమతి భూమె యాదమ్మ శ్రీనివాస్ , ఉపసర్పంచ్ వాజిద్ , జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య , వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి , ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా పశుఘనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గాజీపూర్ నారాయణ రెడ్డి , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మెన్ శ్రీమతి శ్రీలత, రిటైర్డ్ VRO వెంకట రెడ్డి , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. నర్సిరెడ్డి  పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
కామెంట్‌లు