వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
99. మూలాధారైకనిలయా (అష్టాక్షరీ)
100. బ్రహ్మగ్రంధి విభేదినీ (అష్టాక్షరీ)
🪷🙏🌹🎻🎺🎸🪷🙏🌹
నూరవ నామ మంత్రము -
ఓం బ్రహ్మగ్రంధి విభేదిన్యై నమః
"గ్రంధి = ముడి". ప్రతీ మానవుని శరీరంలో, మేరువు లో, మూలాధార చక్రము తోపాటు ఆరు చక్రములు ఉంటాయి. ఈ ఆరు చక్రములలో, మూడు చక్రాలను కలుపుతూ, ఆరు గ్రంధులు లేదా ముడులు ఉంటాయి. ఈ మడులను ఛేదించుకుంటూ ముందుకు ప్రయాణిస్తున్న జగన్మాత అయిన పరమేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "బ్రహ్మగ్రంధి విభేదినీ" అని కొలిచారు. ఆ విధంగా గ్రంధిని ఛేదించి మనకు జ్ఞానాన్ని పంచడానికి వస్తున్న అమ్మకు నమస్కారము.
అమ్మ ఛేదించే బ్రహ్మగ్రంధులు స్వాధిష్ఠాన చక్రములో ఉంటాయి. మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రముల మధ్య, స్వాధిష్ఠాన చక్రము క్రింద ఒక బ్రహ్మగ్రంధి, స్వాధిష్ఠాన చక్రము పైన ఒక బ్రహ్మగ్రంధి ఉంటాయి. మూలాధార చక్రము నుండి పైకి ప్రయాణము మొదలుపెట్టిన కుండలినీ శక్తి, ఈ బ్రహ్మగ్రంధుల యొక్క ముడులు విప్పి/ఛేదించి తన ప్రయాణం ఊర్ధ్వ ముఖంగా సాగిస్తుంది.
ఈ సృష్టిలో ఉన్న ప్రతీ మానవుడు కూడా, మూలాధార చక్రంలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి ప్రభావంతో, నేను, నాది, నా వారు, పరాయి వారు అని అమ్మ ఏర్పరచిన చక్రబంధంలో చిక్కుకుని, ముందు వెనుకలకు ఊగిసలాడుతుంటాడు. భౌతిక సుఖములు, విషయముల మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉంటాడు. కానీ, ఈ నేను, నా, ప్రపంచ సుఖాలకు పైన, సాధారణ జీవి గుర్తించలేనిదీ, నిత్య సత్యమైనదీ ఇంకొకటి ఉన్నది అనే ఆలోచన కూడా చేయలేడు, అమ్మ మాయలో కూరుకుపోయి ఉన్న సామాన్య జీవి.
ఎప్పుడైతే ఈ సామాన్య జీవుడు, అమ్మ తత్వాన్ని నమ్మి, ఈ జగత్తుకు ఆమే తల్లి అని ఒప్పుకుని, ఏ స్థితిలో అయినా నన్ను ఉద్ధరించగలిగేది శ్రీమాత ఒక్కరే అని మనసా వాచా కర్మణా, త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారో, అదిగో, అప్పుడు మొదలవుతుంది, ఆ మానవుని జీవితంలో మార్పు. సాధకుని సాధన లోని తీవ్రతను బట్టి, మూలాధార చక్రములో మహేశ్వరుని యొక్క లింగ రూపాన్ని మూడున్నర చుట్టలుగా చుట్టుకుని ఉన్న కుండలినీ శక్తి, మూలాధార చక్రమునూ, స్వాధిష్ఠాన చక్రమునూ దాటి తన ఊర్ధ్వ ముఖ ప్రయాణం సాగిస్తుంది. స్వాధిష్ఠాన చక్రములో ప్రవేశించడానికి, దాటడానికి అక్కడ ఉన్న బ్రహ్మగ్రంధుల యొక్క ముడులను విప్పి, ఛేదించి పైకి ప్రయాణిస్తుంది, జగన్మాత. ఈ గ్రంధులను ఛేదించడం వల్లనే అమ్మ "బ్రహ్మగ్రంధి విభేదినీ" అయ్యయింది.
అమ్మ "బ్రహ్మగ్రంధి విభేదినీ" అయినందు వలన, సాధకులు తమను చుట్టివున్న అజ్నాన అంధకారాన్ని వదిలించుకుని తమలోనే ప్రాణ రూపంలో ఉన్న పరమాత్మను గుర్తించ గలుగుతారు. తమ సాధన యొక్క లక్ష్యాన్ని చేరుకో గలుగుతారు.
తనను చేరుకోవడానికి కుండలినీ శక్తిని ప్రేరితం చేసే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం బ్రహ్మగ్రంధి విభేదిన్యై నమః అని జపించాలి.
ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాన్తర్గతము - హయగ్రీవ అగస్త్య సంవాదము - శ్రీలలితా సహస్రనామ స్తోత్రము లో నూరవ నామమునకు భాస్కరరాయలవారి భాష్యానికి తెలుగు వివరణ - అమ్మ కరుణా కటాక్ష వీక్షణాల భాగ్యంతో.
🪷🙏🌹🎻🎺🎸🪷🙏🌹
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి