వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
102. విష్ణుగ్రంధివిభేదినీ (అష్టాక్షరీ)
103. అజ్ఞాచక్రాంతరాళస్థా (అష్టాక్షరీ)
నూట మూడవ నామ మంత్రము -
ఓం అజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః
గురువు, తనకు జ్ఞానము కలిగి, ఒకరికి తెలియచెప్పగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తి. అలాగే, మన భౄమధ్య (కనుబొమల మధ్య) నుండి శరీరములోని అన్ని భాగాలకూ, అవి చేయవలసిన పనులు చెప్పబడతాయి. కనుక, ఈ భౄమధ్య ప్రదేశము కూడా గురు స్థానమే. ఈ గురు స్థానము నుండి వచ్చిన ఆదేశాల వలన కొంత జ్ఞానోదయం అయి మనం నడుచుకుంటాము. అందువల్ల శ్రీవిద్యోపాసన లో ఇక్కడ కనుబొమల మధ్య ఉన్న చక్రము "ఆజ్ఞా చక్రము"గా పిలువబడింది. ఈ భౄమధ్యలో వున్న రెండుదళముల పద్మము మీద దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని వశిన్యాది వాగ్దేవతలు "అజ్ఞాచక్రాంతరాళస్థా" అని కీర్తించారు. తన సాధకులకు జ్ఞానాన్ని పంచుతున్న శ్రీమాత కు నమస్కారము.
ఈ "ఆజ్ఞా చక్రము" శబ్దోత్పత్తి జరిగే స్థానము. కుండలినీ శక్తి, సుషుమ్న నాడి ద్వారా మూలాధార చక్రము నుండి సహస్రారము చేరే మార్గము, ఇడ - పింగళ నాడులు కలిసే స్థానము, ఈ "ఆజ్ఞా చక్రము". ఈ "ఆజ్ఞా చక్రము", "ఓఢ్యాణ చక్రము" అని కూడా పిలువబడుతుంది. ఈ "ఆజ్ఞా చక్రము"లో పరమేశ్వరి "ఓఢ్యాణ బంధం" లో, తన ఎడమ మోకాలును ఎడమ చంకలో ఉంచి, కూర్చున్న స్థితిలో ఉంటుంది. కనుక ఈ ఆజ్ఞా చక్రానికి "ఓఢ్యాన చక్రము" అని కూడా పిలుస్తారు. ఈ "ఓఢ్యాణ చక్రము" శ్రీచక్రము మధ్యలో, కేంద్రబిందువు లో ఉంటుంది.
ఏ సాధకుడు తన సాధనా ప్రయాణంలో, మూలాధార చక్రము నుండి సుషుమ్న నాడి ద్వారా సహస్రార చక్రము చేరడానికి, పాంచభౌతిక శరీరము కంటే స్థూల శరీరం, ఈ స్థూల శరీరం కంటే సూష్మ శరీరము నిత్యము సత్యము అయినది అని గుర్తెరిగి, తన సాధనాప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆజ్ఞా చక్రములో ద్విదళ పద్మముపై ఉన్న తనను చేరుకునే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం అజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి