ప్రవాస పద్య పరిమళం - 19: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశము: న్యస్తాక్షరి
వర్ణనాంశము: వరలక్ష్మీ స్తుతి 
న్యస్తాక్షరి: వ-- ర--ల--క్ష్మి



వరుసగా1-6-12-18*  *స్థానములలో   వుంచుతూ వరలక్ష్మీ స్తుతి 

పద్యములోని  నిర్దిష్ట పాదములో నిర్దిష్ట  స్థానములో నియమిత అక్షరాల తోనిర్దేశించిన ఛందస్సులో పూరణ!

1 వ పాదము -  1 వ అక్షరం  - వ 
2 వ పాదము -  6 వ అక్షరం - ర 
3 వ పాదము - 12 వ అక్షరం - ల  
4 వ పాదము - 18 వ అక్షరం - క్ష్మి 

ఛందస్సు: చంపకమాల

(వ)ర తరుణీ లలామ సిత వారిజలోచన  వేద వాఙ్మయీ 
సురుచిర సా(ర)శోభిత ప్రసూన ప్రపుల్ల ముఖీ  సుహాసినీ  
పరమ కృపాకరీ జనని పా(ల) సముద్రపు భాగ్యలక్ష్మి వే 
కరములుమోడ్చి వేడగను గావవె శ్రీ వరల(క్ష్మి) మాతరో! 

కామెంట్‌లు
Popular posts