సుబ్బలక్షణాలున్న శ్రీరాముని చూసి
నేను జీవించియున్నప్పుడే శ్రీరాముడు
ఈ దేశానికి రాజైనచో ఎంత బాగుంటుంది
దశరథ మహారాజు అలా యోచించాడు
రాముని రాజుగా చూడాలన్న ఆశతో రాజు
తన మంత్రులతో ఇష్టంగా ప్రస్తావిస్తాడు
ఈ పూసల రాజ్యమునకు తగినవాడు
తన జేష్ఠ పుత్రుడు శ్రీరాముడనో అంటాడు
రామ పట్టాభిషేకానికి సరైన సమయమని
దశరథుడు దేశదేశల రాజులను జనులను
అయోధ్యపురమునకు పిలిపించి
రాముని పట్టాభిషేకమన్న అదుర్తలో
పుత్రుడు భరతుని అతని మేనమామను
అయోధ్యపురము పిలిపించలేదు
వచ్చినతిథులు అతిధి మర్యాదలు పొంది
అందరూ సమావేశంలో ఆ సీనులైనారు
దశరథ మహారాజు వారందరి మధ్యన
స్వర్గమున ఇంద్రునిలా వెలుగు నతడు
అతడు చెప్పే మాటలు ఆలకించుటకై
వచ్చిన వారంతా ఎదురు చూస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి