ప్రవాస పద్య పరిమళం - 22: - - వెంకట్ కొత్తూర్. Ashburn VA USA
అంశము: నిషిద్ధాక్షరి
వర్ణనాంశము: జ - డ అక్షరాలు లేకుండా జడ వర్ణన 
ఛందస్సు: కందము 



కందము 

తరుణికి కురులే యందము 
పరిపరి విధములుగ ద్రిప్పి పాయల సరసన్ 
మెరుపుల బంగరు నగలను 
మురుపెమ్ముగ గూర్చ వేణి ముద్దుగ నమరెన్ 

కామెంట్‌లు