ప్రవాస పద్య పరిమళం - 24: - •⁠ ⁠వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశం : వర్ణన 
వర్ణాంశము : మన్మథుడు 
ఛందస్సు : చంపకమాల

 


చంపకమాల: 

సుమశర ధారి సుందరుడు చూపుల తూపులనంగ రూపుడై
విమల మనస్కులన్ మరియు వీర కఠోర తపో వరిష్టులన్ 
నిముసములోనె మన్మధుడు నెమ్మది నామదినాశ్రయించగా 
ప్రమదపు భావనామృతము పంచెడి వానికి ప్రేమ మాలికల్ 

==

తూపులు = బాణములు 
అనంగ = అనంగుడు  = మన్మధుడు 
ప్రమద = శృంగార,  సంతోష

==

కామెంట్‌లు