అంశము: వర్ణన
వర్ణనాంశము: కూర్మావతారము.
ఛందస్సు : చంపకమాల
వర్ణనాంశము: కూర్మావతారము.
ఛందస్సు : చంపకమాల
చంపకమాల:
అసురులు దేవతల్గలిసి ఆర్ణవ మున్ మధియించు నిచ్ఛ తో
అసదృశ క్షీరసాగరము నద్భుత రీతిని జిల్క గల్గు యా
ప్రసృమర మందరాద్రి, సహ వాసుకి రజ్జుగ త్రచ్చ బోవ గా
గ్రసనము కాగ నా గిరిని కాచెను శ్రీహరి కూర్మ రూపుడై
==
రజ్జు = తాడు ( కవ్వ మునకు కట్టే తాడు )
త్రచ్చ = చిలుకుట ( Churning)
ప్రసృమర = విస్తరముగా నున్నది, విస్తరించేది
గ్రసనము = కబళించు, swallowing
విస్తారముగా నున్న మందర గిరి మరియు వాసుకి సర్పము తో కూడి (సహ) సాగారాన్ని మధించ బోవగా మందర గిరి సాగరముచే కబళించ బడినట్లు మునిగి పోగా, శ్రీహరి కుర్మావతారుడై కాపాదిన సందర్భము.
##########################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి