ప్రవాస పద్య పరిమళం - 36: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA.
 అంశము: వర్ణన
వర్ణనాంశము:  శ్రీ వాగ్దేవి  స్తుతి 
ఛందస్సు : చంపకమాల



చంపకమాల: 

నిరతము నిన్ను గొల్తు జననీ సరసీరుహ నేత్ర వాఙ్మయీ!
పరిణతి నిమ్ము, డెందమున భారతివై వసియించి మాతరో!
పరమ దయానిధే ప్రతిభ, పాటవమీయగ వేడుకొందు, నీ
చరణము చెంత చేర్చితిని చంపకమాలను భక్తి మీరగన్ 
కామెంట్‌లు