పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి
రామాభిషేక రూపమైన అభ్యుదయమున
భవనప్రాంగణమున నిలిచియుండాలి
పురోహితులు ఆచరించవలసిన
కార్యములను వసిష్ఠుడు ఆదేశించాడు
ఓ రాజా పనులన్నీ పూర్తిఅయినవి
దశరథుడు ఎంతో సంతోషించాడు
సుమంత్రుని రాముని తీసుకు రమ్మంటాడు
సుమంత్రండు రథముపై రామునిని
తీసుకొని సభా మందిరము చేరినాడు
దశరథుడు రాముని కనులారా చూశాడు
శ్రీరాముడు వ్రతమును దిగి తండ్రి చెంతకు
గబగబా అడుగులు వేస్తూ వచ్చాడు
తండ్రి పాదాలకు ప్రణమిల్లి శ్రీరాముడు
తండ్రితో ఆశీస్సులను నొందినాడు
వశిష్ట మహర్షి రాముని ఆశీర్వదించి
సింహాసనం పైన కూర్చోబెట్టాడు
శ్రీరాముని దివ్య తేజస్సులతో
సభాప్రదేశమంతా కాంతితో విరజిల్లేను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి