4వ సర్గ ; - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
శ్రీరాముడు కౌసల్యామాతను దర్శించుట. ఆమె తన కుమారుని ఆశీర్వదించుట 
---------------------------



రేపే పుష్పనక్షత్రం యున్నదని యోచించి
దశరథమహారాజు తన రథసారథిని
శ్రీరాముని చెంతకు పంపి రాముడిని 
అంతఃపురమునకు తీసుకురమ్మంటాడు 

రథసారథి రాముని వద్దకు వెళ్లి ఓ రామా 
నీకు దశరథ మహారాజు పిలుపు వచ్చింది 
శ్రీరాముడు ఆలస్యం చేయకుండా 
రాజభవనమునకు బయలుదేరినాడు 

దశరథుడు తన జేష్ఠ పుత్రుడిని 
అంతఃపురమునకు రమ్మని తెలిపినాడు 
తండ్రి ఆజ్ఞానసారము శ్రీరాముడు 
అంతఃపురమునకు వెళ్ళినాడు 

తండ్రి పాదములకు అతడు నమస్కరించి 
పిలిచిన విషయము తెలుపుము తండ్రి 
దశరథుడు తనయుడిని గుండెల కత్తుకొని 
పిదప చక్కని ఆసనమున కూర్చోబెట్టెను 

నాయనా శ్రీరామ నా మాటలాలకించుము 
నాకు వయసు మీరినది అన్ని అనుభవించితిని 
అశ్వమేధ యాగం మొదలుకొని 
వందల కొలది యజ్ఞములను చేసితిని 

శ్రీరామా నా కలలన్నీ పండినవి 
నాకు పురుషార్థములు సిద్ధించినవి 
నేడు ఈ భూమండలమున నీవు 
సాటిలేని వాడవు "ఓ బంగారు తండ్రీ !

కామెంట్‌లు
Popular posts