పరశురాముడు మహేంద్ర గిరికి వెళ్ళిపోవుట 76వ సర్గ: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
అప్పుడు ఆ మహాముని ఆ ప్రదేశము నందు 
ఇక నీవు ఉండకూడదని ఆదేశించాడు 
అతనికి నమస్కరించి నేను వచ్చితిని
ఓ వీరరాఘవా! నా చిన్న కోరిక మన్నించు 

నీవు నా గమన శక్తిని తొలగించకయ్యా
నే పర్వతోత్తమైన మహేంద్రగిరికి వెళ్తాను 
రామా! నా పుణ్యశక్తులు పుణ్యరాసులను 
నీ శరప్రయోగముతో నశింపజేయుము 

ఇక నీవు ఏమి ఆలస్యం చేయవలదు
ఈ మహాదనస్సును ఎక్కుపెట్టినప్పుడే 
నీవు మహావిష్ణువని నే గ్రహించితిని 
రణరంగమున నీవు అసహాయశూరడవు 

నీవు అద్భుత లీలమహితుడవు
దేవతలందరూ నిన్ను దర్శించుటకు వచ్చిరి 
నీ చేతిలో నేను ఓటమిపాలగుట 
నాకేమాత్రము లజ్జాకరము గాదు 

ఓ రామా తిరుగులేని నీ బాణమును 
త్వరగా ప్రయోగించుము స్వామి 
నేను మహేంద్ర గిరికి వెళ్ళిపోయెదను 
రాముడు ఆ మహాశరమును ప్రయోగించెను

పరశురాముడు రామునికి నమస్కరించి
మహేంద్రగిరి పర్వతమునకు వెళ్ళినాడు
అష్టదిక్కులకు కమ్మిన చీకట్లుతొలగిపోగా 
దేవతలు ఋషులు రామున్ని పొగిడినారు 


కామెంట్‌లు