కైకేయికి మంథర దుర్బోధ.
-
కైకేయి మెట్టింటికొచ్చినప్పుడు
ఆమెవెంట అరణపుదాసి మంథర వచ్చెను
శ్రీరామపట్టాభిషేకముహూర్తమందు రాత్రి
అటిటు తిరుగుతూ ప్రసాదముపై కెక్కును
అయోధ్య నగరమునందు వీధులన్నీ
దీపాలతో పూలమాలలతో అలంకరించి
కనులకింపుగా కనబడుచుండెను
పూల పల్లేరములతోబ్రాహ్మణులుండిరి
వీధులలో స్త్రీపురుషులందరూ
సంతోషముతో ముచ్చటించుచుండిరి
పట్టపురాని ఏదైనా పండగ చేస్తూ
అందరికీ దానధర్మాలు చేస్తుందా
ఆలోచిస్తూ అటూ ఇటూ చూస్తుంది
ఎదురుగున్న ప్రాసాన మీద రామదాదిని
మంథర చూసి ఓ దాది ఏమి వేడుకలు
ఈ పురమున జరుగుచున్నవి
సంతోషమున ఉక్కిరిబిక్కిరయి ఆ దాది
రేపు శ్రీరాముని పట్టాభిషేకం జరుగును
అందుకని అయోధ్యపురమంతా
అందంగా తోరణాలతో అలంకరించినారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి