బక్రిచెప్యాలలో అందమైన ప్రభుత్వ పాఠశాల. పచ్చని చెట్లతో కలకలాడుతుంది.కానీ పాఠశాల ఆవరణలో కొంత ఖాళీ మైదానం ఉంది. బదిలీపై కొత్తగా వచ్చిన సోషల్ సార్ పిల్లలతో ఇలా మాట్లాడారు.మన పాఠశాల అందంగా ఉండాలంటే ఏమి చేయాలి అని పిల్లలను అడిగారు.నీరజ్ అన్నాడు పూల చెట్లు పెడదాం సార్. అమూల్య చెప్పింది. కూరగాయలు పెంచితే మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడతాయి సార్. సారు ఆనందంతో నవ్వాడు. అవును పిల్లలు మనమే మన బడి తోట పెంచుకుందాం అన్నారు.
తర్వాత రోజు కొంకలు, కొడవళ్ళు, పీకాసులు,పార, గడ్డపారలు, తట్టలు తీసుకొని పాఠశాలకు వచ్చారు.ఖాళీ స్థలాన్ని శుభ్రం చేశారు.సోషల్ సార్ మొక్కల గూర్చి వివరించారు.మొక్కలకు నీరు,ఎరువు అవసరం.మనం జాగ్రత్తగా పెంచుకుంటే మనకు ఫలితాలు ఇస్తాయి అన్నారు.పిల్లలు సంతోషంతో టమాట, బీరకాయ, దొండకాయ,వంకాయ, చిక్కుడు,సొరకాయ, మొక్కలు నాటారు కొందరు పూల మొక్కలు నాటారు. గులాబి,మందారం,శంఖు పూలు,బంతి,సన్నజాజి, మల్లెపూలు మొక్కలు నాటారు.ప్రతిరోజు నీరు పోస్తున్నారు. కలుపుతీస్తున్నారు.కొద్ది రోజులకే మొక్కలు పెద్దగా పెరిగాయి.పిల్లల కళ్ళల్లో ఆనందం వెలుగులు చూసాయి.నెల,రెండు నెలలకే వరకే తోట పచ్చగా మారింది. పూల సువాసనతో బడి పరిసరాలు నిండిపోయాయి. కూరగాయలు కొని మధ్యాహ్నం భోజనంలో వాడుచున్నారు. ప్రధానోపాధ్యాయులు గారు సోషల్ సారును మరియు పిల్లలను మెచ్చుకున్నారు.మీ ఇంటిలో కూడా ఈ విధంగా తోటను పెంచాలని విద్యార్థులకు హితబోధ చేశారు.సోషల్ సార్ ను శాలువా సన్మానించారు. విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు.
కలిసి పని చేస్తే చిన్న పని కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుందని పిల్లలు సార్లు కలిసి నిరూపించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి