ఆరోగ్యాయువర్ధనం.: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,94410 58797.
నా పంచపదుల సంఖ్య----- 2228-2230.


 

2228.
పతంజలి ,ముని ,యోగి ,
తత్వవేత్త ,యోగానికి ఆది!  

విశ్వాన యోగ సూత్రాల,
ఆయనే వేసినాడు పునాది!

ఆ సేవల సంస్మరణ ,
జూన్ ఇరవై ఒకటో తేదీ!

విశ్వ యోగా దినోత్సవం ,
మానవ చైతన్య మూలమది! 

దేశమంతా ఆబాలగోపాలం,
 యోగానంద ప్రదర్శన, పివిఎల్! 

2229.
యోగా, శారీరక, మానసిక, 
 తాత్త్విక సమతుల్యత!

పెంపొందించే ఓ పురాతన, 
భారతీయ ప్రామాణికత! 

శ్వాస నియంత్రణ, ధ్యానం, 
ఆసనాల, నిజవిశేషత! 

ఒత్తిడి తగ్గించి ,
       శరీరదృఢత ,
          ఆరోగ్య ప్రదాత!

రోగనిరోధక శక్తి పెంచి,
గుండె ఆరోగ్య సంధాత, పివిఎల్! 

2230.
ఏకాగ్రత వృద్ధి, సమృద్ధిగా, 
మానసిక ప్రశాంతత! 

కండరాల బలం, శరీరవశ్యత ,
సరి సమైక్యత! 

కర్మ /భక్తి/ జ్ఞాన/ రాజ,
నాలుగు మార్గాల సౌలభ్యత! 

ప్రతిదినం యోగా,
    ప్రాణాయామం, 
          ఆసనాల సార్ధకత!

ఆరోగ్యవంత వృద్ధాప్యమే, 
  యోగా సాధన సాఫల్యత, పివిఎల్!
_________

కామెంట్‌లు
Popular posts