అలిసిన చూపులు": - మాణిక్యాలరావు పంచదార్ల-సెల్ : 9441754215
ఎప్పటిలాగే!
సంధ్యా తీరం రమ్మంటుంది 
మనసు వెళ్లగానే!
పచ్చని గరిక చాపలు
కూర్చోమంటాయి

సిగ్గు తీగలు వెచ్చని పరువాలు
బిగి కౌగిలి చుంబన దృశ్యాలు
ఆ చోటు పికాసో పెయింటింగ్స్

అవేవీ పట్టించుకోవు
నిరుద్యోగి కళ్ళు..
మరెందుకూ నిత్యం వస్తావని?
ప్రశ్నిస్తాయి లేత లేత పుస్తకాలు

జవాబుగా
శరత్కాల జలదరమై చూశా...
కంటి సంకేతాలు కూడా అటే...
సంకోచ వ్యాకోచాల వైపు

చీకటి పడింది నింగిలోకి
తారలొచ్చాయి వెన్నెలా వచ్చింది
సమయం ఎలా గడిచిందో తెలీదు

వేదాంత వాసనల్ని మోస్తూ
ప్రణయ వాగ్దానాలు వింటూ
ఇవాళ కూడా...
ఆ పిలుపు రాలేదని
అలిసిన చూపులతో
బయటకొచ్చా ఎప్పటిలాగే
ఒంటరిగా

కామెంట్‌లు