"భాషపై ఆర్తి - తెలుగుకు కీర్తి": - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట చరవాణి: 9490904976
ఆంధ్రుల మాతృ భాష తెలుగు
అధికార, రాజ భాష  తెలుగు...

తెలంగాణ  తల్లి భాష తెలుగు..
తెలంగాణ తొలి భాష తెలుగు..

తెల్లవారి వెలుగు తెలుగు..
ఎల్లరూ ఎరిగిన తెలుగు..

చీకట్లు చీల్చిన తెలుగు..
వెలుగులు విరజిమ్మే తెలుగు..

ఫ్రెంచ్ ను మించిన తెలుగు..
ప్రపంచ ఖ్యాతి పొందిన తెలుగు..

విదేశీయులు మెచ్చిన తెలుగు..
స్వదేశీయులు నచ్చిన తెలుగు..

నన్నయ నడక నేర్పిన తెలుగు..
అన్నమయ్య అక్షర కీర్తనల తెలుగు..

తిక్కన తియ్యందనం తెలుగు.
జక్కన కమ్మదనం తెలుగు..

ఎఱ్ఱన ఎరిగిన తెలుగు..
పోతన అవపోసన పట్టిన తెలుగు..

గుండ్రని అక్షరాల లిపి తెలుగు..
గుణింతాల గమ్మత్తు  తెలుగు..

అందచందాల తెలుగు..
అద్భుత పదసంపద తెలుగు..

తెలుగు మాట్లాడితే వేల నాడులు కదులు..
పరభాషలకై ప్రాకులాడడం వదులు..

తెలుగు వింటే మనసుకు హాయి కలుగు.
తెలుగు వారంటే ఆత్మీయత పెరుగు..

దక్షిణ భారతదేశంలో దేదీప్యంగా వెలిగిన తెలుగు..
దేశ భాషలలో వాడుకలో నాల్గవ స్థానం దక్కిన తెలుగు..

దేశ భాషలందు తెలుగు లెస్సనీ..
శ్రీనాథుడు మొదట చెప్పిన తెలుగు.. 
శ్రీకృష్ణ దేవరాయలు వారలు 
ఆపై గొప్పగా పొగిడిన తెలుగు..

సుందర తెనుంగని కీర్తించిన
తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్..
మధుర భాషని తెలుగును మెచ్చిన
బెంగాలీ మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్..

ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని
నికోలో డి కాంటే నినదించిన తెలుగు..
తెలుగు భాషకు నిఘంటువును
తయారుచేయించి అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌను..
తెలుగు భాషకు దక్కింది క్రౌను(మకుటం).

భారత ప్రభుత్వంచే ప్రాచీన భాషగా
గుర్తింపు పొందింది "మన తెలుగు"..
భేషైన భాషగా నిలిచింది మన తెలుగు..

తెలుగు భాష  మునుపటిలా
పూర్వ వైభవాన్ని అందుకుని అద్భుతమౌను..
తెలుగు జాతి గర్వించదగును.

భాషపై పెరగాలి ప్రతి ఒక్కరికీ ఆర్తి
తప్పక దక్కుతుంది కీర్తి..
తెలుగుకు ఎనలేని ఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతి.


కామెంట్‌లు