గిరిజనుల పిల్లలం !: : - గుర్రాల లక్ష్మారెడ్డి - సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్
గిరిజనుల పిల్లలం
 పురజనుల మల్లెలం
 అడవి తల్లి పోరలం
 పుడమి మల్లి వారలం !

పుట్ట తేనె జోపుతాం
గట్టు తోవ చూపుతాం
గట్టు దేవర మా దేవుడు
మా బొందిలోని జీవుడు !

మన్యం అడవుల్లోపుట్టినం
దైన్యాన్ని  విడిచి పెట్టినం 
ధైర్యాన్నిక కూడ గట్టినం
అడవినంతా మేం చుట్టినం !

కొండ కోనల్లో తిరుగుతాం
కొండ దేవర పూజ చేస్తాం
వనమూలికలు సేకరిస్తాం
మేం మీకు ఇక అందిస్తాం !

 వనదేవత మా అందరి తల్లి
  ప్రతినిత్యం  మేమంతా వెళ్లి
  పూజా పునస్కారం చేస్తాం
  మనసారా మేం నమస్కరిస్తాం 

  తిరునాళ్ళను కూడా జరిపిస్తాం
  పురజనులను వేగా మురిపిస్తాం
 భక్తుల కోర్కెలకు మేం స్పందిస్తాం
తీర్థప్రసాదాలను వారికి అందిస్తాం


కామెంట్‌లు