అందం !: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత.-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ

 

గుమ్మానికి కడప అందం
ఇంతికి నగలు అందం
ఇంటికి నలుసులు అందం
కంటికి కాటుక అందం !

       అదిరే పెదవులు అందం
       బెదిరే చూపులు అందం
        కదిలే నడకలు అందం
        సిగ్గుల మొగ్గలు అందం !

పిల్లల నవ్వులు అందం
మల్లెల సొగసులు అందం
ముద్దు మురిపాలు అందం
సుద్ధుల ముద్దులు అందం !

         మూతికి మీసం అందం
         నాతికి రోషం అందం
         మెడకు గంధం అందం
          గోడకు సున్నం అందం !

ఓడకు చుక్కాని అందం
మెడకు ఆహారం అందం
చెట్టుకు ఆకులు అందం
అందరికీ లతలు అందం !

       సిగలోన పూలు అందం
      నగలోన మెరుపు అందం
       ఇంటికి ముగ్గులు అందం
       ఒంటికి వలవలు అందం !

డొంకకు  దారి అందం
జింకకు పరుగు అందం
వాగుకు వంక అందం
నింగికి చుక్కలు అందం !

        భాషకు వాక్కు అందం
        గోషకు ముసుగు అందం
        చేతికి గాజులు అందం
         నాతికి మోజులు అందం !

కామెంట్‌లు