నేను మనసారా పెంచుకున్న
నా చిన్నారివి నీవేరా ఓకన్నా
నా కంటి పాపలాగా నేను నిన్ను
రేయి పగలు కాపలా కాస్తున్నా !
అమ్మలా నిన్ను నేను లాలిస్తా
కమ్మని తాయిలం నే తినిపిస్తా
బొమ్మలు ఎన్నో నీకు కొనిపిస్తా
బొమ్మల కొలువుతో మురిపిస్తా !
అమ్మ లాగా నే జో కొడుతా
నాన్న లాగా నే జోడి కడతా
చల్ చల్ గుర్రం పై ఎక్కిస్తా
చల్ మోహనరంగా అనిపిస్తా !
నేను దాగుడుమూతలు ఆడిస్తా
నీతోనే దండాకోర్ అని అనిపిస్తా
ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
అని వారిని మన ఇంట్లో దాచేస్తా !
కనిపెట్టాలని నీవు ఇక చూస్తావు
ఇంట్లోని ప్రతి మూల వెతికేస్తావు
దొరికితే వాడవుతాడు ఇక దొంగ
దొరకని వాడవుతాడులే ఓ దొర !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి