ఆ రోజులు...: - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
గుణం చూసి మర్యాద 
ఇచ్చే వారు ఆనాడు 
ధనానికి విలువెక్కువ 
చూడంగా ఈనాడు 

స్వచ్ఛమైన హృదయాలు 
విరబూసిన కుసుమాలు 
యోచిస్తే అలనాడు 
ఉండేవి అనురాగాలు 
 
ఎటుచూసినా మోసము 
అడుగడుగునా ద్రోహము 
మసిబారి పోయెను నేడు 
మనిషిలో మానవత్వము 
 
ప్రేమలొలికే  మనసులు 
పొంగిపొర్లే మమతలు 
అపురూపం ఆ రోజులు
మరుపురాని జ్ఞాపకాలు 


కామెంట్‌లు