ఓ జనక మహారాజ ఆ శివధనస్సు
శ్రీరామునికి చూపుమయ్య
విశ్వామిత్రుని మాటలు విని జనకుడు
చందన పుష్పాలతో ఉన్న ధనస్సును
సభలో చేర్చుటకు మంత్రులనాజ్ఞాపించును
బలిస్టులైన ఐదువేల మంది అటు వచ్చి
ఎనిమిది చక్రాలశకటంపై ఉన్న ధనస్సును
వారు సభా మందిరంలోకి తెచ్చినారు
జనకుడు విశ్వామిత్రునికి వందనమొనర్చి
రామలక్ష్మణులతో ఇలా అంటాడు
ఈ ధనస్సు ఎక్కుపెట్టుటకు
ఎందరో మహారాజులు ప్రయత్నించారు
దానిని కొంచెం కూడా కదపలేకపోయారు
రామ ఆ ధనస్సును విరిచి చూపుము
పిదప సీతను పరిణయ మాడుము
సభాముఖంగా జనకుడు తెలిపినాడు
విశ్వామిత్రుడు రాముడిని పిలిచి
రామ ఈ ధనసును ఒక్కసారి చూడు
శ్రీరాముడు ధనసును భద్రపరచిన
పేటికను తెరిచి ధనస్సును జూచినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి