సుప్రభాత కవిత : - బృంద
మేఘమాలల కౌగిలి 
మెల్లగా విడిపించుకుని 
దూర తీరాన వేచిన 
ధరణిని పలకరించాలని....

రంగులు నింపిన అంబరపు 
సంబరానికి సంతోషిస్తూ 
గగనపు దారులలో 
మంద గమనముతో.....

మరకతాలు పరచిన నేలపై 
మమతలు కురిపిస్తూ... 
సడిలేని సలిలపు ముంగిట 
స్వర్ణ రేఖల ముగ్గులు వేస్తూ....

చూపుల తాకిడికై వేచిన 
సుమబాలల చుంబిస్తూ...
ఊగే గరికల వాటేసి 
ఊయలలూగుతూ...

నిదురించిన జగతిని 
మధురముగా  మేలుకొలిపి 
చెదిరిన ఆశల చిగురింపచేసి 
అదను చూసి నడిపించు....

ఆప్త మిత్రునికి వినమ్రతతో 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు