సుప్రభాత కవిత : - బృంద


మనసుతో యుద్ధం 
మౌనమే ఆయుధం 
మారని నమ్మకం 
మార్పుకై నిరీక్షణం 

ఒంటరి ఊహల ఊయల
ఊపేవారెవరు?
తుంటరి కలతలు తొలగించే 
నేస్తం ఎవరు?

కష్టం లేని కథలు లేవు 
ఇష్టం కాని విషయంలో!
ఎండమావులు అందుకోవాలంటే 
ఎంత  ఆయాసం!

చిక్కులెన్ని ఎదురైనా 
మొక్కవోని దీక్షలో 
దిక్కులు చూడని ధైర్యం 
ఒక్కటే వీడని నేస్తం!

దరి చేరని విజయం కోసం 
మరిమరి చేసె ప్రయత్నంలో 
దారి తప్పనివ్వని నిర్ణయం 
మారిన బ్రతుకు చిత్రం!

కనుచూపు మేరలో 
కానవచ్చే వెలుగు 
కనులు అలసిపోకనే 
కనికరించి చేయందించే 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు