ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము- 293 వ రోజు
అభిమన్యుని ప్రతాపం
దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై కార్చిచ్చు అడవిని దహించినట్లు కురుసేనలను దహిస్తున్నాడు. అభిమన్యుడు ప్రయోగిస్తున్న అస్త్రముల ధాటికి రధ, గజ, తురంగ, పదాతి దళములు నాశనం ఔతున్నాయి. కేతనములు విరిగిపడుతున్నాయి. సారధులు మరణిస్తున్నారు. ధనస్సులు విరుగుతున్నాయి. శత్రుసైన్యముల శరీరంలో అత్యంత క్రూర శరములు నాటుకున్నాయి. రణరంగం కకావికలైంది. పీనుగులు కుప్పలుగా పడ్డాయి. అభిమన్యుని ధాటికి పద్మవ్యూహం చెదిరి పోయింది. కురు సేన పారి పోసాగింది. అది చూసిన సుయోధనుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అది చూసిన ద్రోణుడు తమ సైన్యంలోని అతి రధ మహారధ యోధులను పిలిచి సుయోధనుడు అభిమన్యుని ఎదుర్కొంటున్నాడు. మీరంతా వెళ్ళి సాయం చెయ్యండి " అన్నాడు. అప్పుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, శకుని, పౌరవుడు, వృషసేనుడు అంతా కలిసి సుయోధనునికి సాయంగా వెళ్ళి ఒక్కుమ్మడిగా అభిమన్యుని చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. చేత చిక్కిన సుయోధనుడు చేజారినందుకు అభిమన్యుడు క్రుద్ధుడై అతి రథ మహారధుల మీద అస్త్రశస్త్రములు కురిపించాడు. అభిమన్యుని ధాటికి కురుసేన పారి పోసాగింది. ఇది చూసిన ద్రోణుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమ
న్యునిపై శరములు గుప్పించాడు. పారి పోతున్న కురుసేన తిరిగి వచ్చి అభిమన్యునితో పోర సాగాయి. అభిమన్యుడు అతి లాఘవంగా వారు ప్రయోగించిన శరములు త్రుంచి వారి శరీరాలు తూట్లు పడేలా కొడుతున్నాడు. అభిమన్యుని శౌర్యం చూసి ఆశ్చర్యపడిన సుయోధనుడు చకితుడైనాడు.
కురుప్రముఖులు అభిమన్యుని ఒక్కుమ్మడిగా ఎదుర్కొనుట
పారి పోతున్న తన సేనలను చేయి ఊపి పిలుస్తూ అభిమన్యుని ఎదుర్కొన్నాడు. సుయోధనుడు, భూరిశ్రవసుడు, కృపాచార్యుడు ఒక్కొక్కరు మూడేసి బాణములు, ద్రోణుడు పదిహేడు, వివిశంతి ఇరవై బాణములను, అశ్వత్థామ అయిదు బాణములు, బృహద్బలుడు ఎనిమిది బాణములను, శల్యుడు ఆరు బాణములతోను, దుశ్శాసనుడు పన్నెండు బాణములతో ఒక్క సారిగా అభిమన్యుని కొట్టారు. ఆ బాణములన్నీ త్రుంచిన అభిమన్యుడు వారి శరీరంలో మూడేసి బాణములు గుచ్చాడు. అశ్మకుని కేతనము త్రుంచి, విల్లు త్రుంచి అతని శిరస్సు ఖండించాడు. అది చూసిన కురుసేన భీతి చెంది పారిపోసాగింది, ద్రోణుడు వారిని తిరిగి యుద్ధోన్ముఖులను చేసాడు. నీకుమారులు అందరిని కూడగట్టుకుని అభిమన్యునిపై బాణములు గుప్పించారు. అభిమన్యుడు బెదరక వారి శరీరాలను శరములతో బాధించాడు. కర్ణుని కవచమును భేదించి వక్షస్థలము మీద క్రూరమైన బాణమును గుచ్చాడు. ఆ దెబ్బకు కర్ణుడు మూర్ఛపోయాడు. నీ కుమారులందరిని వెనక్కు తరిమాడు. శల్యుడు అభిమన్యుని ఎదుర్కొనగా అభిమన్యుడు శల్యుని అత్యంత పదునైన బాణంతో కొట్టి మూర్ఛిల్ల చేసాడు. అభిమన్యుడు సింహనాదం చేసాడు. కురుసేనలు ద్రోణుడు వద్దని ఎంత వారించినా వినక పారి పోయాయి " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు " సంజయా అభుమన్యుని తరువాత ఎవరు ఎదుర్కొన్నాడు " అన్నాడు. సంజయుడు " శల్యుడు మూర్ఛపోవడం చూసి అతడి తమ్ముడు అభిమన్యుని ఎదిరించి అభిమన్యునిపై పది బాణములు వేసాడు. అభిమన్యుడు ఆ బాణములు మధ్యలో త్రుంచి శల్యుని తమ్మునిపై రథమును విరిచి, హయములను చంపి, చేతులు నరికి ఆఖరుగా శిరస్సు ఖండించాడు, ఇది చూసిన మిగిలిన రాజకుమారులు భయభ్రాంతులైయ్యారు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరిని ఒకరు పిలుచుకుని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుని ఎదుర్కొన్నారు. అది చూసి అభిమన్యుడు సాక్షాత్తు అర్జునుడే అక్కడ ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ గుండ్రటి విల్లు ధరించాడా అన్నట్లు అందరిపై శరవర్షం కురిపించాడు. అభిమన్యుడు కౌరవ వీరుల మీద భల్లములు, అంజలకములు, క్షురపములు, కూర్మనఖములు మొదలయిన బాణములు ప్రయోగిస్తున్నాడు. అభిమన్యుని ప్రతాపము విని ధృతరాష్ట్రుడు మోదము ఖేదముల మ్మిశ్రిత భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తరువాత ఏమైంది అని ఆత్రంగా అడిగాడు. సంజయుడు " ఆ ప్రకారం పారిపోతున్న కౌరవ సేనలను అభిమన్యుడు పారిపోనీయక వారిచుట్టూ తన రధమును తిప్పుతూ ఎడతెరిపి లేని శరములు గుప్పిస్తూ రణరంగాన్ని పీనుగుల పెంట చేసాడు. అభిమన్యుని ప్రతాపం చూసి ద్రోణుడు కృపాచార్యునితో " అచార్యా ! చూసారా తన తల్లితండ్రులు, మామలు, స్నేహితులు, సోదరులు సంతోషించే విధంగా అభిమన్యుడు శత్రు సంహారం చేస్తున్నాడు. రథ, గజ, తురంగాదులను నేల కూలుస్తున్నాడు. అతడి ముందు మన సైన్యంలో వీరులు ఎవరూ నిలువ లేకున్నారు " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి