సామంత రాజులందరూ సంతోషించి
ఆనందంతో దశరథుని అభినందించారు
సభలో ఆసీనులైన వశిష్ఠాది బ్రాహ్మణులు
దశరథమహారాజును ఆశీర్వదించినారు
దశరథుడు రాజులందరినిలా అంటాడు
రాముని పట్టాభిషేకం గూర్చి నేను తెల్పగా
మీరందరూ సంతోషంతో ఉన్నారు
మీకు నా పాలన నచ్చక ఒప్పుకున్నారా
నేను ధర్మబద్ధంగా పాలన చేశానా
ఎవరినైనా కష్టపెట్టానా విన్నవించగలరు
రాముని యువరాజుగా కోరుకున్న మీరు
నా ప్రశ్నలకు సమాధానం తెలుపగలరు
సభలో ఉన్న వారంతా ఏకకంఠంతో
నీ పాలన కోసలరాజ్యమున సురక్షితము
సందేహము వలదు ఉత్తముడైన వాడు రాముడు
శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది
దివ్యగుణములలో ఇంద్రునితో సమానుడు
ఈ లోకములో రాముని లాంటి పురుషుడు
ఎచ్చట వెతికిన దొరకడు దశరథా
క్షమగుణమున భూదేవితో సామానుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి