అలిగిన ఆవిడ – అల్లాడుతున్న ఆయన: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
భార్య
దీర్ఘ సెలవు తీసుకుంది,
భర్తను
బహు కష్టాలకు గురిచేసింది॥

చేతులు
కాల్చుకుంటున్నాడు,
కడుపు
మాడ్చుకుంటున్నాడు॥

బయటకు
వెళ్ళలేకపోతున్నాడు,
బంధాలు
తెంచుకోలేకపోతున్నాడు॥

తోడులేక
జాగారాలు చేస్తున్నాడు,
ఒంటరై
ఉపవాసాలు ఉంటున్నాడు॥

పనులు
చేసుకోలేకపోతున్నాడు,
బాధలు
అనుభవిస్తున్నాడు॥

బ్రతిమాలుటకు
పూనుకోలేకపోతున్నాడు,
భంగపడటానికి
తయారుకాలేకపోతున్నాడు॥

కాళ్ళు
పట్టుకోలేకపోతున్నాడు,
గడ్డం
ముట్టుకోలేకపోతున్నాడు॥

కోర్టుకు
ఈడ్చలేకపోతున్నాడు,
పరువును
తీసుకోలేకపోతున్నాడు॥

డబ్బులు
లాగేస్తుంది,
ఖర్చులు
పెంచేస్తుంది॥

పక్కదారి
పట్టలేకపోతున్నాడు,
దారిలోకి
తెచ్చుకోలేకపోతున్నాడు॥

పాపం
ఆయన ఇబ్బందిపడుతున్నాడు,
కాలం
గడపలేక సతమతమవుతున్నాడు॥

కోడుకు
చెప్పినా వినటంలేదు,
కూతురు
రమ్మన్నా వెళ్ళటంలేదు॥

రాయబారం మొదలుపెట్టండి
రాజీ వెంటనే కుదర్చండి,
అలకలన్నీ కరిగిపోయేలా
అనురాగ దీపం వెలిగించండి॥

భర్త వ్యథలను తీర్చండి
భార్య కోపాన్ని తగ్గించండి,
ముసలిజంట మురిసిపోయేలా
మళ్లీ కలిపి నవ్వించండి॥


కామెంట్‌లు
Popular posts