ఆకలి ఎరిగి అన్నం పెట్టేందుకు ఒకరు ఉన్నంత వరకు...
తిన్నావా అని అడగడానికి ఒకరు ఉన్నంత వరకు...
ఆలస్యమయ్యే రాత్రులలో ఎక్కడ ఉన్నావు అని ఆరా తీయడానికి ఒకరు ఉన్నంత వరకు...
అనారోగ్యం వస్తే రాత్రులలో కంటిమీద కునుకు లేకుండా చూసుకోవడానికి ఒకరు ఉన్నంత వరకు...
గొంతు మార్పును బట్టి మానసిక స్థితిని కనిపెట్టడానికి ఒకరు ఉన్నంత వరకు...
చేరుకున్నాక ఫోన్ చేయి అని సాగనంపడానికి ఒకరు ఉన్నంత వరకు...
రాత్రి ఎంత ఆలస్యమైనా ఇంట్లో తలుపు తీయడానికిఒకరు ఉన్నంత వరకు...
ఓడిపోయి తిరిగి వస్తున్న ప్పుడు భుజం తట్టి ఆదరించ డానికి ఒకరు ఉన్నంత వరకు...
గొడవ పడి పొమ్మన్నా వదిలిపోకుండా మాట పడుతూనైనా తోడుండటానికి ఒకరు ఉన్నంత వరకు...
మనసు భారమయ్యే జ్ఞాపకాలను పంచుకోవడానికి ఒకరు ఉన్నంత వరకు...
మన కలలను తమ కలలుగా భుజాలపై మోయడానికి ఒకరు ఉన్నంత వరకు...
దేనికోసమో, ఎవరికోసమో మనల్ని వదిలేయక తక్కువ చేయకుండా పలకరించేందుకు ఒకరు ఉన్నంత వరకు...
సమూహం మధ్యలో ఒంటరిగా ఉండినప్పుడు చేతులు పట్టు కుని నేనున్నానని గుర్తుచేయడానికి ఒకరు ఉన్నంత వరకు...
తప్పులను తప్పులని ఎత్తి చూపి సరిదిద్దేందుకు ఒకరు ఉన్నంత వరకు...
దుఃఖం ముంచెత్తే క్షణాలలో దగ్గరుండి కన్నీళ్లు తుడవడానికి ఒకరు ఉన్నంత వరకు...
మనసులోని బాధలను చెప్తున్నప్పుడు ఓపిగ్గా వినడానికి ఒకరు ఉన్నంత వరకు...
జీవించడం మధురం...!
ఈ జీవితమూ మధురమే...!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి