ఏమిటి ఈ పెళ్లి వేడుకలు : - కవిమిత్ర సాహిత్యరత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్ అమెరికా
 

కూతురు పెళ్లి కుదిరిందని 
కాకినాడలో ఉన్న కామేశ్వరరావు 
వైశాఖమాసం పున్నమి నాడు వివాహాం 
మీరు పెద్దమ్మ తప్పక రావాలని 
ఐదు రోజులు పెళ్లి ఘనంగా చేస్తామని 
కెనడాలో కాబోయే వరుడు పని చేస్తున్నాడని 
పెద్దలు మీ ఆశీస్సులు ఉండాలని చెబితే 
అరవై ఏళ్ల కిందట సనాతన సాంప్రదాయ ప్రకారం 
ఐదు రోజుల పెళ్లి చేస్తున్నాడు కామాక్షి అని 
మా ఇంటి ఇల్లాలు తో చెబితే 
తప్పక వెళదాం మీతమ్ముడు ఎలాగులేడు 
మనమే పెద్దలం దగ్గరుండి 
మనవరాలు పెళ్లి చేద్దాం అంటే 
సంతోషంగా వెళ్లిన మాకు పెళ్లి తంతు చూసి 
ఆశ్చర్యమేసింది 
మొదటి రోజు ఇరువైపుల వారి పరిచయాలు 
ఆ తర్వాత విందులు వినోదాలు 
మరుసటి రోజు వెడ్డింగ్ షూట్ పేరిట 
పెళ్లి గాక ముందే వరుడు వధువు 
సినిమా షూటింగ్ మాదిరిగా కొండలు, కోనల్లో 
హీరో హీరోయిన్ల లా భంగిమలు 
సంగీత్ అనే కార్యక్రమం లో జరిగే రికార్డు డాన్స్ లు 
వచ్చిన స్త్రీలందరికీ చేతులకే గాక 
ఎక్కడ బడితే అక్కడ గోరింటాకుపెట్టడం
పెళ్ళికొడుకు గుర్రం పై రావడం 
తరువాత పల్లకీలో ముప్పై సంవత్సరాలు దాటిన
వధూవరుల ఊరేగింపు 
పెళ్లి జరుగుతునంతసేపు కెమెరా మరియు వీడియో వారు చెప్పినట్లు 
పీటలమీద కూర్చున్న తల్లిదండ్రులకు కూడా వినడం
వేద పండితులు చెప్పే మంత్రాలు 
డిజిటల్ సౌండ్ ల మోతలలో వినబడకపోవడం
పెళ్లి వేదిక అలంకరణకే లక్షల రూపాయలు వెచ్చించడం 
ఏబై రకాల పిండి వంటలతో 
యూనిఫారం డ్రెస్  కోడ్ తో 
ప్లేటు పట్టుకు వెళ్లిన వారికి వడ్డించడం 
ఎన్నో ఎన్నెన్నో వింత పోకడలతో 
నేడు జరిగే వివాహాలను చూసి 
నాలో నేనే అనుకున్న ఎందుకు విడాకులసంఖ్య దేశంలో ఎక్కువ అవుతాయన్నది 
విజ్ఞులు  ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి..!!
..............................
కామెంట్‌లు