సప్తపది సాక్షిగా: - పంచదార్ల మాణిక్యాలరావు
 నాడు సప్తపది సాక్షిగా
ఏకమైన జీవితాలన్నీ
నేడు
కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి.
 
అహంకారాల పోరులో
అనుబంధాల రంగు
వెలిసిపోతోంది.
మురిపెంగా వేసిన అడుగులు
ముక్కలైపోతున్నాయి.
 
పవిత్రమైన పెళ్లి పీటలు
విడాకుల వేదికలుగా
మారుతున్నాయి.
ఏడడుగుల బంధాలన్నీ
ఇగోల బాట పడుతున్నాయి.
 
మనసుల కలయిక
అన్న మాట
నేడు మచ్చుకైనా
కానరావడం లేదు

కామెంట్‌లు