ప్రభుత్వం ఉచిత మెరుగైన విద్య అందిస్తుందనీ,యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేరాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి గారు తెలిపారు.
బుధవారం యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్ . పద్మావతి గారు మాట్లాడుతూ కళాశాలలో ఈసారి 64 శాతం ఉత్తీర్ణత సాధించామని విశాలమైన తరగతి గదులున్నాయనీ, ఆర్.ఒ మినరల్ వాటర్ సౌకర్యం కలదనీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధన చేస్తున్నారనీ, ఉచిత పుస్తకాలు పంపిణీతో డిజిటల్ బోర్డులద్వారా సి.సి పర్యవేక్షణలో, ఆధునాతన సైన్స్ పరికరాలతో మెరుగైన విద్య అందిస్తున్నామనీ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహిస్తామనీ, ఎస్సీ,ఎస్టీ, బి.సి, ఈ.బి.సి, మైనారిటీ స్కాలర్షిప్ సౌకర్యం కలదనీ, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదనీ, జాతీయ స్థాయిలో ప్రముఖ కోచింగ్ సంస్థలైన ఖాన్ అకాడమీ,
ఫిజిక్స్ వాలా( జె.ఇ.ఇ) మొదలగు పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతున్నాయనీ, హాజరుకై ముఖ గుర్తింపు (ఎఫ్.ఆర్.ఎస్) ఉంటుందనీ , ఎన్.ఎస్.ఎస్ ద్వారా సామాజిక సేవకులుగా తయారవుతారనీ, సర్టిఫికెట్స్ ఉద్యోగాల్లో ఉపపయోగపడుతాయనీ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యోగా, మెడిటేషన్,టెలీమానస్, ఆంటీ డ్రగ్, ఒత్తిడి తగ్గించడానికి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయనీ, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించబడుతాయనీ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వారికి బిటెక్, ఫార్మసీలలో ఉచిత విద్య అందించబడుతుందనీ కళాశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు చేరాలని సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు.
అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, లైబ్రరీ ఇంచార్జీ వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత ,నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్, అనుముల రవిచంద్ర, వెల్దండి సౌమ్య, అగోలం గౌతమీ , బోధనేతర సిబ్బంది వి.విమల్ కుమార్ ,కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి