ఓ మహర్షి ఈ ధనువును తాకిచూసెద
దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించెద
జనక ,విశ్వామిత్రులు సమ్మతించిరి
రామున్ని అందరూ వింతగా చూస్తున్నారు
రాముడు ధనస్సు మధ్య భాగము పట్టి
అల్లెత్రాడు గుంజి వంచెను ధనస్సును
రాముడు వింటినారిని సంధించగా
ఆ వీళ్ళు పెళ్ళు పెళ్ళున విరిగిపడగా
ధ్వని పిడుగు వలె భయంకరముగా ఉన్నది
పర్వతములు బ్రద్దలైపోయినట్లు
భూమి నంతయు కపించెను
రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా మూర్చ నొందిరచట
జనకుడు రాముని పరాక్రమము చూసి
నా బిడ్డను దశరథ పుత్రునికి ఇచ్చెద
ఇప్పుడే మంత్రులను అయోధ్యకంపెద
దశరథరాజును మిథిలకు స్వాగతించెదను
మునీశ్వరుడు అందుకు సమ్మతించెను
జనక మహారాజు మంత్రులను పిలిపించి
శుభపత్రమును వారి చేతికి ఇచ్చి
దశరథుని తోలుకొని రమ్మని తెలిపినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి