వశిష్టుడు ఇక్ష్వాకువంశ చరిత్రను వివరించుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
జనక సోదరుల పిలుపు మేర దశరథుడు 
వశిష్టునెంట రామలక్ష్మణులతో 
బ్రాహ్మణులతో బంధువుల సపరివారముగా 
జనకమహారాజు చెంతకు వెళ్ళినాడు 

మా గురువు వశిష్టడు మా వంశము గూర్చి 
మీకు వివరముగా తెలుపును వినుడు 
వశిష్టుడు వారి నడుమ కూర్చొని 
ఇక్ష్వాకవంశం గూర్చి మొత్తము తెలిపును

అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి 
బ్రహ్మ జన్మించాడు అతడు శాశ్వతుడు 
బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను 
మారీచిని పుత్రుడు కాశ్యపుడు 

హాస్యపుని పుత్రుడు  సూర్యుడు 
సూర్యుని పుత్రుడు వై వస్వతమణువు 
ఈ మనువే మొదటి ప్రజాపతి 
మనువు పుత్రుడు ఇక్ష్వాకు 

అయోధ్య అధిపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే 
ఇక్ష్వాకుని పుత్రుడు కుక్షి సుభశోభితుడు
కుక్షి సుతుడు వికుక్షిసూనుడు భానుడు
భానుని తనయుడు అనరన్యుడు


కామెంట్‌లు