వెన్నెల వెలుగు: - పంచదార్ల మాణిక్యాలరావు
   పల్లవి:
 
వినరమ్మా మీరు వినరమ్మా
చుక్కల రాజును చూడండమ్మా
మేఘాల మాటున దాగుడుమూత
నింగిలో విరిసిన వెన్నెల పూత ||
 
                                 ||వినరమ్మా||
 
 
చరణం 1:
 
నీలి ఆకాశపు నిర్మల తోట
మెరుపుల తీగల దోబూచాట
వెండి వెలుగులు పంచుతూ పైన
తిరుగునుకదా కొండల చాటున ||
 
                                 ||వినరమ్మా||
 
 
చరణం 2:
 
పొద్దున చూసితే నిదుర పోవును
రేయి చూస్తే మెరుస్తూ వచ్చును
చల్లని వెన్నెల వాన కురిపించును
చక్కగా పిల్లలను ఆటలాడించును ||
 
                                     ||వినరమ్మా||

కామెంట్‌లు