సుప్రభాత కవిత : - బృంద


లేలేత కిరణాలు 
సోకినంత 
కనకమైపోయేనే 
కరకు కొండ...

పైపైని పారాడు 
నల్లమబ్బు 
ఆపలేక పోయేనే 
తగలకుండా 

విరిసేటి కుసుమాల 
సంబరాలు 
అందుకోగా చూసేనే 
ఆ అంబరాలు 

లోయలో కనిపించు 
పచ్చని అందాలు 
మనసులో నాటేనే 
హాయి మొలకల్లు...

ఈ కొండ దారిలో 
అందాలు చూస్తూ..
తప్పిపోవాలనిపించే
వెర్రి తలపులు..

ఎంత సుందరమైనదో 
ఈ వసుంధర...
దివిలోని వైభవము 
ఇంతకన్నా మిన్న అగునే?

పూవులో మధువుగా 
ఆకులో పచ్చదనంగా 
కొండలో రాయిగా 
ఉండాలనుంది హాయిగా!

🌹🌹సుప్రభాతం 🌹🌹

కామెంట్‌లు